- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP: ఆవేశం తగ్గింది.. అసలు విషయం బోధపడింది...!
ఆవేశంలో ఆవేశపడితే ఆ తర్వాత పశ్చాత్తాపం తప్పదని మరోసారి నిరూపితమైంది. నిన్నటి వరకు ఎమ్మెల్యే పార్థసారథిపై నిప్పులు చెరిగిన ఓ వైసీపీ కార్యకర్త నేడు తన తప్పు తెలుసుకుని బహిరంగంగా క్షమాపణలు కోరారు...

దిశ, వెబ్ డెస్క్: ఆవేశంలో ఆవేశపడితే ఆ తర్వాత పశ్చాత్తాపం తప్పదని మరోసారి నిరూపితమైంది. నిన్నటి వరకు ఎమ్మెల్యే పార్థసారథి(Mla Parthasarathy)పై నిప్పులు చెరిగిన ఓ వైసీపీ(Ycp) కార్యకర్త నేడు తన తప్పు తెలుసుకుని బహిరంగంగా క్షమాపణలు కోరారు. శుక్రవారం ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇస్తూ వీడియో విడుదల చేసిన సదరు కార్యకర్త, శనివారం వినయంగా 'క్షమించండి' అంటూ మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మాజీ ఎమ్మెల్యే కోసం వార్నింగ్
అసలు విషయానికొస్తే.. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి(Former MLA Sai Prasad Reddy)పై విమర్శలు చేస్తే సహించేది లేదని, ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమంటూ సదరు కార్యకర్త గతంలో హెచ్చరించారు. సాయిప్రసాద్ రెడ్డి గురించి విమర్శలు మానుకోవాలని ఎమ్మెల్యే పార్థసారథిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి.
గంటల వ్యవధిలోనే మారిన స్వరం
అయితే, ఏం జరిగిందో ఏమో కానీ గంటల వ్యవధిలోనే ఆ కార్యకర్త స్వరం మార్చారు. తాను ఆవేశంలో తప్పుగా మాట్లాడానని, ఎమ్మెల్యే పార్థసారథిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. తనను పెద్ద మనసుతో క్షమించాలని కోరుతూ ఆయన విడుదల చేసిన తాజా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.






