కర్నూలు ప్రజలకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-02 12:33:47  IST  )

కర్నూలు జిల్లా ఓర్వకల్లు టు విజయవాడ ఇండిగో విమాన సర్వీసులు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు..

కర్నూలు ప్రజలకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District) ఓర్వకల్లు(Orvakallu) నుంచి విజయవాడ(Vijayawada)కు ఇండిగో విమాన సర్వీసులు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Central Minister Rammohan Naidu) ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. వారంలో మూడు రోజులు పాటు ఈ సర్వీసు రాకపోకలు సాగనున్నాయి. ఈ మేరకు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కర్నూలు జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే డ్రోన్ హబ్ కర్నూలుకు రాబోతోందని చెప్పారు. ఇందుకోసం కర్నూలు విమానాశ్రయానికి కనెక్టివిటీ పెంచుతామని తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రద్ధ చూపుతున్నారని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Next Story