ఒక్క రూపాయికే కిలో టమాటా.. ఎక్కడంటే..?

by Vemula.Srinu Prasad |

పత్తికొండ మార్కెట్ లో టమాటా ధరలు అమాంతం పడిపోయాయి...

ఒక్క రూపాయికే కిలో టమాటా.. ఎక్కడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: టమాటా(Tomato) లేకుండా కూర ఉండదు అని అంటారు. అంతలా దిగుబడి అందించే రైతు(Farmer) మాత్రం అమాంతం మునిగిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు రావడంలేదు. దీంతో చేసేదేమీ లేక పంట మొత్తాలన్ని నేల పాలు చేస్తున్నారు. ఇలాంటి ఘటన తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో చోటు చేసుకుంది. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు ఈరోజు పత్తికొండ మార్కెట్‌కు తీసుకొచ్చారు. అయితే మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కిలో ధర రూపాయికి పతనం అయింది. దీంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. తెచ్చిన మొత్తం టమాటాలను రోడ్డుపై పారబోసి ఆందోళనకు దిగారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టమాటా పంటకు గిట్టు కల్పించాలని, అలాగే పత్తికొండ సమీపంలో నిర్మాణమవుతున్న టమాటా జ్యూస్ ఫ్యాక్టరీని త్వరగా పూర్తి చేయాలని కోరారు.

Next Story