85 రోజుల సరిపోవు..సమయం పెంచండి: TNSF

by Disha Web Desk 16 |
85 రోజుల సరిపోవు..సమయం పెంచండి: TNSF
X

దిశ,ఆలూరు: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్షల కోసం ఇచ్చిన 85 రోజుల సమయం సరిపోదని టీఎన్ఎస్ఎఫ్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఆలూరు తాలూకా అధ్యక్షుడు తలారి సిద్ధప్ప ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వడ్డే పెద్దయ్య మాట్లాడుతూ గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు మ‌రో 3 నెల‌ల అద‌న‌పు స‌మ‌యం ఇవ్వాల‌ని డిమాండ్‌ చేశారు. గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష క్వాలిఫై అయిన అభ్యర్థులు ప్రిపరేషన్ కోసం కేవ‌లం 85 రోజులే ఇచ్చార‌ని, ఏడు పేపర్లు ప్రిపేర్ కావ‌డానికి ఈ స‌మ‌యం చాల‌ద‌ని పేర్కొన్నారు. మెయిన్స్ పరీక్షకు అన్ని అంశాల్లో అవ‌స‌ర‌మైన‌ లోతైన జ్ఞానం, విశ్లేషణ చేసేందుకు ఈ మూడు నెల‌ల స‌మ‌యం స‌రిపోద‌ని వివ‌రించారు. మెయిన్స్ పరీక్షకు మరో మూడు నెలల అద‌న‌పు సమయం పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కొత్తవారితోపాటు, ఉద్యోగాలు చేసుకుని గ్రూప్-1 రాసేవారికి ఈ అద‌న‌పు స‌మ‌యం ప్రిపేర్ కావ‌డానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు.


Next Story

Most Viewed