కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన బ్యాంకు.. లబోదిబోమంటున్న మహిళలు

by Vemula.Srinu Prasad |

నమ్మి బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే బోర్డు తిప్పేశారు....

కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన బ్యాంకు.. లబోదిబోమంటున్న మహిళలు
X

దిశ, వెబ్ డెస్క్: నమ్మి బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన ఘరానా మోసం నంద్యాల జిల్లాలో జరిగింది. కోవెలకుంట్లలో నాలుగేళ్ల క్రితం జననీ సహకార పరపతి పొదుపు సంఘం బ్యాంకును ఏర్పాటు చేశారు. తమ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీలు చెల్లిస్తామని ప్రకటించారు. దీంతో స్థానిక మహిళలు భారీగా డబ్బులు డిపాజిట్ చేశారు. అలా కోట్లు వసూలు చేసిన బ్యాంకు అధికారులు మూడు నెలల క్రితం బోర్డు తిప్పేశారు. బ్యాంకు సీఈవో వెంకటరమణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.


దీంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వాళ్లు పట్టించుకోలేదు. దీంతో బాధితులు ఈ విషయాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మహిళలు ఎలాంటి ఆందోళన చెందొద్దని, డిపాజిట్ చేసిన డబ్బులను తిరిగి ఇప్పించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. బ్యాంకు సీఈవోపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

Next Story