రూ. 500 కోసం కొట్టుకున్న అర్చకులు.. పోలీస్ స్టేషన్‌కెక్కిన పంచాయితీ

by Vemula.Srinu Prasad |

నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం జరిగింది. రూ. 500 కోసం అర్చకుల మధ్య ఘర్షణ జరిగింది. చౌడేశ్వరి దేవాలయంలో పూజారిగా పని చేస్తున్న వీరేష్‌పై సూర్యనారాయణ దేవాలయానికి చెందిన అర్చకుడు సురేష్ దాడి చేశారు..

రూ. 500 కోసం కొట్టుకున్న అర్చకులు.. పోలీస్ స్టేషన్‌కెక్కిన పంచాయితీ
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా నందికొట్కూరు(Nandikotkur)లో దారుణం జరిగింది. రూ. 500 కోసం అర్చకుల మధ్య ఘర్షణ జరిగింది. చౌడేశ్వరి దేవాలయం(Chowdeshwari Temple)లో పూజారిగా పని చేస్తున్న వీరేష్‌పై సూర్యనారాయణ దేవాలయానికి చెందిన అర్చకుడు సురేష్ దాడి చేశారు. తనపై మాటల దాడితో పాటు శారీరకంగా కూడా దాడి చేసినట్లు పోలీసులకు బాధిత పూజారి వీరేష్ ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నారు.

దీంతో ఈ ఘటనపై ఆలయ ప్రధాన కార్యదర్శి చట్ట మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ప్రతిష్టలను మంటగోలిపిన పూజారి సురేష్‌పై కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దేవాలయం పవిత్రతను కాపాడాల్సిన అర్చకులే ఇలా గొడవలకు దిగడం చాలా దురదృష్టకరమని అటు స్థానికులు అంటున్నారు.

Next Story