- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, శ్రీశైలం: శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ కానుకలు లెక్కించారు. 2 కోట్ల 80 లక్షల 75 వేల 669 రూపాయల నగదు వచ్చింది. ఈ ఆదాయం గత 24 రోజులలో స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ ఈవో లవన్న తెలిపారు. నగదుతోపాటు యుఎస్ఏ డాలర్లు 769, మలేషియా రింగిట్స్ 3, యూరోపియన్ 70, సింగపూర్ డాలర్లు 10, యూ.ఏ.ఈ దిర్హమ్స్ 25, కెనెడా డాలర్లు- 80 అలానే పైవాటితోపాటు 177 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం, 3 కేజీల 500 గ్రాముల వెండి లభించాయని చెప్పారు. ఇక పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో లవన్న పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది .ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
Next Story






