Kurnool: ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

by Disha Web Desk 16 |
Kurnool: ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, కర్నూలు ప్రతినిధి: పది, ఇంటర్, డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్‌లలో అత్యధిక మార్కులు సాధించిన రజక విద్యార్థుల నుంచి ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రజక వ్యవస్థాపక అధ్యక్షులు సీపీ వెంకటష్ తెలిపారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని జొహరాపురం గ్రామ సమీపంలోని బాలాజీ విల్లాస్ లోని రజక విద్యాసేవా సమితి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సమితి జిల్లా గౌరవాధ్యక్షులు గిరిధర్ కుమార్‌తో కలిసి మాట్లాడారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పదిలో 450లకు పైగా మార్కులు సాధించిన రజక విద్యార్థులకు, ఇంటర్‌లో 850 మార్కులు, డిగ్రీలో 80 శాతం ఉత్తీర్ణత సాధించిన వారికి, ఎంసెట్, మెడిసిన్, ఇంజనీరింగ్‌లో 10 వేల లోపు ర్యాంకులు సాధించిన రజక విద్యార్థులకు జిల్లా రజక చైతన్య సంఘం తరపున నాలుగేళ్లుగా ప్రతిభ పురస్కారాలు రజక కార్తీక వన మహోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలు ఇచ్చేవారమన్నారు.

అయితే ఈ ఏడాది నుంచి ప్రతిభ పురస్కారాలు ఇచ్చేందుకు రజక విద్యా సేవా సమితిని స్థాపించి ఇకపై ప్రతిభ సాధించిన రజక విద్యార్థులకు విద్య సేవాసమితి పేరిట పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. అందువల్ల అర్హులైన కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన విద్యార్థులు ఈ నెల 31వ తేదిలోపు వారి వివరాలను ఇంటినెంబర్ 41-473, 119, సాయిబాబా సంజీవ నగర్ అనే అడ్రస్ కు పంపాలన్నారు. వివరాలకు 9110396511, 7780506001, 850027240, 9642528240 నెంబర్లను సంప్రదించాలని కోరారు.


Next Story

Most Viewed