- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kurnool: గ్రామాల్లో చంద్రబాబుకు పెరుగుతున్న మద్దతు
రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని మంత్రాలయం తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు..

X
దిశ, మంత్రాలయం: రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు పాలకుర్తి తిక్కారెడ్డి తనయుడు తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు. పెద్దకడబూరు మండలం గంగుల పాడులో క్లస్టర్ ఇంచార్జ్ లీగల్ సెల్ అధ్యక్షుడు బాబురావు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబుపై పెట్టిన కేసులను ప్రజలకు తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విఫలం అయ్యారని, ప్రజలు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలిపారు. రోజురోజుకు గ్రామాల్లో చంద్రబాబు నాయుడుకి మద్దతు పెరుగుతోందని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ తప్పకుండా గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Next Story






