- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nandyala: పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న సీఎం జగన్
పేదల సొంతింటి కలను సీఎం జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని నంద్యాల ఎమ్మెల్యే సతీమణి, 36వ వార్డు కౌన్సిలర్ నాగిని రవి సింగారెడ్డి అన్నారు...

X
దిశ, నంద్యాల: పేదల సొంతింటి కలను సీఎం జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని నంద్యాల ఎమ్మెల్యే సతీమణి, 36వ వార్డు కౌన్సిలర్ నాగిని రవి సింగారెడ్డి అన్నారు. నంద్యాల 36వ వార్డులో ఇల్లు లేని 47 మందికి ఆమె ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ వారి పేరు మీదనే ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా రూపకల్పన చేసిందన్నారు. ఇంకా చాలా మంది ఇల్లు లేని పేదవారున్నారని, టీడీపీ నాయకులు కోర్టులకు వెళ్లడంతో ఆ స్థలాలు నిలిచిపోయాయని చెప్పారు. కోర్టులో విజయం సాధించి త్వరలో వాటిని కూడా పేదలకు అందించే బాధ్యత నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తీసుకుంటారని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే శిల్పా కుటుంబ ధ్యేయమని నాగిని రవి సింగారెడ్డి తెలిపారు.
Next Story






