కర్నూలులో భూమా అఖిల ప్రియ ఆందోళన.. స్వల్ప ఉద్రిక్తత

by srinivas |
కర్నూలులో భూమా అఖిల ప్రియ ఆందోళన.. స్వల్ప ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు(Kurnool)లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ ప్రతిక సంస్థ వద్ద ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ(Allagadda MLA Bhuma Akhilapriya) ఆందోళన వ్యక్తం చేశారు. తనపై తపుడు కథనాలు రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరులతో కలిసి చెత్త వ్యర్థాల(Garbage waste)ను కార్యాలయం ఎదుట పోసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తనపై ఉద్దేశపూర్వకంగా రాసిన కథనాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రతికా కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. భూమా అఖిల ప్రియతో మాట్లాడి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా వివాదాన్ని సర్దుమణిగించారు. అయితే పత్రిక సంస్థ యజమానిపై మాత్రం అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



Next Story

Most Viewed