Srisailam: వైభవంగా ఉగాది మహోత్సవాలు

by Disha Web Desk 16 |
Srisailam: వైభవంగా ఉగాది మహోత్సవాలు
X

దిశ, శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వరకు 5 రోజులపాటు జరిగే ఉగాది మహోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీస్వామివారి యాగశాల ప్రవేశం చేసి ఆలయ అర్చకులు, వేదపండితులు, ఆలయ ఈవో ఎస్.లవన్న దంపతులు ఘనంగా ప్రారంభించారు. అర్చకులు వేదపండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతిపూజ, శివసంకల్పం, చండీశ్వరపూజ, కంకణాధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి ఉగాది మహోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు.

ఉగాది మహోత్సవాల్లో భాగంగా అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవారు బృంగివహం ఆశీనులై ప్రత్యేక పూజలందుకున్నారు. క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవంగా భక్తులకు దర్శనమిస్తూ బృంగివహంపై విహరించారు.

Next Story

Most Viewed