- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూలు జిల్లాలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన నేతలు
by Vemula.Srinu Prasad |
కర్నూలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు ఉండవల్లిలో నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు...

X
దిశ, కర్నూలు ప్రతినిధి: కర్నూలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు ఉండవల్లిలో నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. కర్నూలు 17వ డివిజన్ కార్పొరేటర్ కైపా పద్మాలతా రెడ్డి, కేవీ.సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ అధినేత సుబ్బారెడ్డి, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ అధినేత కైపా అశోక్ కుమార్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి నారా లోకేష్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జిల్లాలో పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని లోకేష్ వారికి సూచించారు. టీడీపీతోనే కర్నూలు జిల్లా అభివృద్ధి సాధ్యమని, వైసీపీ అధికారంలోకొచ్చాక జిల్లాకు ఒరిగిందేమీ లేదని పార్టీలో చేరిన సుబ్బారెడ్డి, పద్మాలతా రెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి విమర్శించారు. కర్నూలుకు వచ్చిన పరిశ్రమలు ప్రభుత్వ వేధింపులతో పరారయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






