Kurnool | 4 నెలల చిన్నారి కిడ్నాప్.. నిందితుడి అరెస్ట్

by Thanuru Gopichand |

4 నెలల చిన్నారిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసిన సంఘటన కర్నూలులో జరిగింది.

Kurnool | 4 నెలల చిన్నారి కిడ్నాప్.. నిందితుడి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : 4 నెలల చిన్నారిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసిన సంఘటన కర్నూలులో జరిగింది. కిడ్నాప్ చేసిన చిన్నారిని విక్రయించేందుకు నిందితుడు యత్నించే క్రమంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సునీత అనే మహిళ కర్నూలు కొత్త బస్టాండ్ (Kurnool New Bustand) ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. తరచుగా ఆ ప్రాంతంలో తిరిగే కర్నూలుకు చెందిన ఆటో డ్రైవర్ మధు అక్కడ భిక్షాటన (Beggars) చేసేవారితో పరిచయం పెంచుకున్నాడు. చిన్నారి ఆలనపాలన సరిగ్గా లేకపోవడంతో చిన్నారిపై మధు కన్ను పడింది. ఈ క్రమంలో నవంబరు 8న చిన్నారిని కిడ్నాప్ (Toddler Kidnap) చేసి కర్నూలు నుంచి పరారయ్యాడు. దీంతో బాధితురాలైన సునీత (Sunitha) అదే రోజు కర్నూలు నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మధు బాలికను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో (Secunderabad Railway Station) చిన్నారిని విక్రయించేందుకు యత్నిస్తుండగా రైల్వే పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు. అక్కడి నుంచి కర్నూలుకు తీసుకొచ్చారు. చిన్నారికి తల్లి సునీతకు అప్పగించారు. మధుపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story