శ్రీశైలం సాక్షిగా.. ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై కర్ణాటక ప్రయాణికుల దాడి

by Vemula.Srinu Prasad |

నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖర చెక్‌పోస్టు వద్ద దారుణం జరిగింది. ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై కర్ణాటక బస్సు కండక్టర్, ప్రయాణికులు జరిపిన దాడి చేశారు. రోడ్డుపై వాహనాల రాకపోకలు, క్రమశిక్షణ విషయంలో చిన్నపాటి వివాదం తలెత్తింది...

శ్రీశైలం సాక్షిగా.. ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై కర్ణాటక ప్రయాణికుల దాడి
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖర చెక్‌పోస్టు వద్ద దారుణం జరిగింది. ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై కర్ణాటక బస్సు కండక్టర్, ప్రయాణికులు జరిపిన దాడి చేశారు. రోడ్డుపై వాహనాల రాకపోకలు, క్రమశిక్షణ విషయంలో చిన్నపాటి వివాదం తలెత్తింది. ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై కర్ణాటకకు చెందిన ప్రైవేట్ బస్సు కండక్టర్, ప్రయాణికులు భౌతిక దాడి చేశారు.ఈ ఘటనతో ప్రయాణికులు, తోటి ఆర్టీసీ సిబ్బంది ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. పొరుగు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థలో సమన్వయం లోపించడమే ఈ ఘటనకు కారణమని స్థానికులు అన్నారు. బాధ్యతాయుతమైన డ్రైవర్‌పై ఇలాంటి అవమానకర దాడిపై విమర్శలు కురిపించారు.

Next Story