- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓ వ్యక్తికి పొలంలో దొరికిన వజ్రం.. దాని విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
వజ్రాల విలువ ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: వజ్రాల విలువ ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. విలువైన వజ్రాలు దొరుకుతున్నాయంటే ఎవరు వదులుకోరు. ఈ క్రమంలో వజ్రాల కోసం వేట మొదలుపెడతారు. అయితే ఇటీవల రాయలసీమలో కురిసిన వర్షాలతో పంట పొలాలు, ఖాళీ ప్రదేశాల్లో వజ్రాలు దొరుకుతున్నాయని ప్రచారం జోరందుకుంది. దీంతో జనం జొన్నగిరి ప్రాంతానికి భారీగా వెళుతున్నారు.
ఓ రైతుకు వజ్రం(Diamond) దొరకడంతో ఆయన లక్షాధికారి అయ్యారని, తమ జీవితాలు కూడా టర్న్ అవుతాయనే ఉద్దేశంతో పక్క జిల్లాల నుంచి కూడా జనం తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని మద్దికెర, తుగ్గలి మండలాల పరిధిలోని గ్రామాలకు వజ్రాల కోసం చాలామంది వెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఏపీ(Andhra Pradesh)లోని కర్నూలు జిల్లా(Kurnool district)లో వజ్రాల వేట మొదలైంది.
జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాల వేట ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఒకరికి అదృష్టం వరించినట్లు ప్రచారం జరుగుతోంది. మద్దికేర మండలం లో నిన్న(ఆదివారం) ఒకరికి ఖరీదైన వజ్రం లభించినట్లు తెలుస్తోంది. ఆ వజ్రాన్ని స్థానిక వ్యాపారి రూ.30 లక్షలు చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం.






