- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖిలప్రియను అడ్డుకున్న పోలీసులు.. ఆళ్లగడ్డలో హైటెన్షన్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ...

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అదేశాల మేరకు ఆళ్లగడ్డలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ మంత్రి అఖిల ప్రియ యత్నించారు. దీంతో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కారును ముందుకు వెళ్లనివ్వాలని డిమాండ్ చేశారు. అయినా సరే కారును పోలీసులు కదలనివ్వలేదు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి వెళ్లడానికి లేదని, అనుమతి నిరాకరించారు. దీంతో కారులోనే అఖిలప్రియ కూర్చుని డోర్లు లాక్ చేసుకున్నారు. మరోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఆళ్లగడ్డలో హైటెన్షన్ కొనసాగుతోంది. అటు పోలీసులు సైతం భారీగా మోహరించారు. అఖిలప్రియతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






