- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుంకేసులకు భారీగా వరద.. 4 గేట్లు ఎత్తివేత
సుంకేసులకు భారీగా వరద నీరు చేరుతోంది...

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District)లో భారీగా వర్షాలు(Heavy Rains) కురుస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టులకు సైతం వరద భారీగా వచ్చి చేరుతోంది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతోనూ తుంగభద్ర నది(TungaBadra Rivar)కి భారీగా వరద నీరు(flood water) చేరుతోంది. దీంతో కోసిగి మండలంలోని ఆర్డీఎస్ ఆనకట్ట(RDS Dam) వద్ద వరద ఉధృతి పెరిగింది. అటు సుంకేసుల డ్యామ్(Sunkesula Dam) సైతం నిండిపోయింది. ఈ మేరకు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఏ సమయంలోనైనా వరద నీరు పెరిగితే మళ్లీ గేట్లు ఎత్తి కిందరు నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సుంకేసుల డ్యామ్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






