- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యపై అనుమానం.. నీళ్ల డ్రమ్ములో ముంచి 8 నెలల చిన్నారిని చంపిన తండ్రి
by Vemula.Srinu Prasad |
నీళ్ల డ్రమ్ములో ముంచి 8 నెలల చిన్నారిని తండ్రి చంపారు..

X
దిశ, పత్తికొండ : కర్నూలు జిల్లా పత్తికొండ డివిజన్ దేవనకొండలో విషాద ఘటన జరిగింది. భార్యపై అనుమానంతో 8 నెలల చిన్నారిని నీటి డ్రమ్ములో ముంచి నరేష్ అనే వ్యక్తి చంపేశారు. అనంతరం భార్య శ్రావణిని చంపేందుకు ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు గమనించడంతో కొన ఊపిరితో ఉన్న భార్యను వదిలేసి నరేష్ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రావణిని మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నరేష్ గతంలో మొదటి భార్యను చంపి జైలుకు వెళ్లి వచ్చారు. అనుమానమే పేను భూతంగా మారి తండ్రి నరేష్ ఎనిమిది నెలల చిన్నారిని నీళ్ల డ్రమ్ములో ముంచి చంపడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.
Next Story






