- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నాలుగో సోమవారం కావడంతో భక్తులు శ్రీశైలానికి పోటెత్తారు.

దిశ, శ్రీశైలం : కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నాలుగో సోమవారం కావడంతో భక్తులు శ్రీశైలానికి పోటెత్తారు. వేకువజాము నుంచే అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ముందుగా భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించుకుని శ్రీ స్వామి అమ్మ వార్ల దర్శనార్థమై ఆలయానికి చేరుకుంటున్నారు.
దర్శనం ఏర్పాట్లు
కార్తీకమాసంలో ప్రభుత్వ సెలవుదినాలు, కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజులలో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకుంటున్నారు. భక్తులందరు సంతృప్తికరంగా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా ఆలయాధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. వేకువజామున 3గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాత:కాల సేవలను జరిపించారు. అనంతరం ఉదయం 4.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దర్శనాలను కొనసాగించనున్నారు. అదేవిధంగా తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి దర్శనాలు కొనసాగనున్నాయి. కార్తీక మాసం రద్దీ రోజుల్లో అనగా శని, ఆది, సోమవారాలు శుద్ధ ఏకాదశి కార్తిక పూర్ణిమ మొదలైన రోజులు( కార్తీక మాసంలో మొత్తం 16 రోజులు) స్వామివారి స్పర్శ దర్శనం పూర్తిగా నిలుపుదల చేశారు. ఈ రద్దీ రోజుల్లో సామూహిక అర్జిత అభిషేకాలను కూడా నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
క్యూలైన్లో అల్పాహారం
కార్తీక మాసం నేపథ్యంలో శ్రీశైల మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు అల్ఫాహార ఏర్పాట్లను చేశారు. క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు ఉదయం నుంచి వేడి పాలను కూడా అందజేస్తున్నారు. అలాగే భక్తులకు అల్పాహారంగా పులిహోర, పెరుగన్నం, కట్ట పొంగలి, మంచినీరు, బిస్కెట్లు అందజేస్తున్నారు.






