- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆళ్లగడ్డలో క్రికెట్ బెట్టింగ్.. ఐదుగురు అరెస్ట్, భారీగా నగదు సీజ్
నంద్యాల జిల్లాలో జోరుగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతోంది...

దిశ,వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా(Nandyala District)లో జోరుగా క్రికెట్ బెట్టింగ్(Cricket Betting) జరుగుతోంది. భారత్ దేశంతో పాటు ఇతర దేశాల్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచులపై కోట్లలో బెట్టింగులు కాస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్(IPL Match)లో రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్న మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. దీంతో ఐదుగురు నిందితులు పట్టుబడ్డారు. రూ.2.6 లక్షల నగదు సీజ్ చేశారు.
చాగలుమర్రి మండలం మల్లెవేముల చౌరస్తాలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద బెట్టింగ్ ముఠా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిందితులు మహహ్మద్ రఫీ, మద్దిలేటి రెడ్డి, బాబా ఫక్రుద్దీన్, సాకలి హరికృష్ణ, షేక్ షరీఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సెల్ ఫోన్లతో పాటు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.






