AP Farmers: నిర్మలమ్మ బడ్జెట్‌పై నిరసన.. గుణపాఠం చెబుతామని వార్నింగ్

by Disha Web Desk 16 |
AP Farmers: నిర్మలమ్మ బడ్జెట్‌పై  నిరసన.. గుణపాఠం చెబుతామని వార్నింగ్
X

దిశ, కర్నూలు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రామీణ ప్రజలను విస్మరించిందని, కార్పొరేట్లకు ఊడిగం చేసేలా ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.నారాయణ విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ కర్నూలు కలెక్టర్ ముందు రైతు, వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానీకాన్ని మరింత దారిద్ర్యంలోకి నెట్టివేసిందని మండిపడ్డారు.


రైతాంగానికి సంబంధించి ఎరువుల సబ్సిడీ ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేశారరు కానీ స్వామినాథన్ సిఫారసు కమిటీల మేరకు కనీస మద్దతు ధరపై మాట్లాడలేదని అసహనం వ్యక్తం చేశారు. అహర్నిశలు శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం పని చేసిన కూలీలకు నేటికీ వేతనాలు ఇవ్వలేదని, గతేడాది బడ్జెట్ సరిపోకపోతే ఈ సంవత్సరం ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. ఉపాధి హామీ ఎత్తివేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బడ్జెట్కు నిరసనగా అఖిలభారత కమిటీలు ఇచ్చే పోరాటంలో జిల్లా కమిటీలు కూడా పాల్గొని గ్రామీణ ప్రజానీకానికి అండగా నిలవాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని, లేనిపక్షంలో సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మండల నాయకులు పీబీ హుస్సేనయ, నరసింహులు, మధు, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

నెల్లూరు నుంచే పతనం మొదలైంది.. జగన్‌‌కు Nara Lokesh హెచ్చరిక

Next Story

Most Viewed