రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజలు ఎదిరించాలి!.. దాసోజు శ్రవణ్ ఫైర్

by Ramesh Goud |
రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజలు ఎదిరించాలి!.. దాసోజు శ్రవణ్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణ ప్రజలపై పన్నుల భారాన్ని మరింత మోపి పదవీకాలాన్ని ఎల్లదీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. భూములపై మార్కెట్ ధరల సవరణకు సీఎం ఆదేశాలు ఇవ్వడంపై స్పందించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి విధానాన్ని ఎదిరించాలని ప్రజలను కోరారు. తెలంగాణలో భగ్గుమంటున్న భూముల రేట్లు..! అంటూ ట్విట్టర్ వేదికగా ఫోటో పోస్ట్ చేసిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అవగాహనా లేమితో, అధికారదాహాంతో వనరుల కనీస లభ్యతను చూసుకోకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చాడని ఆరోపించారు.

ఇప్పుడు దిక్కుతోచక, దిక్కుమాలిన ప్రణాళికతో సాధారణ ప్రజలపై పన్నుల భారాన్ని మరింతగా పెంచి పదవీ కాలాన్ని ఎల్ల దీసుకోవాలనే ప్రయత్నాల్లో వున్నాడు..! అని తెలిపారు. అందులో భాగమే భూముల ధరల్ని పెంచి పన్నుల్ని రాబట్టాలని అధికార యంత్రాంగాన్ని నిరంకుశంగా ఆదేశించిండు..! అని, ఇట్టి ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజలు, ప్రజా సంఘాలు ఎదిరించాలని దాసోజు శ్రవణ్ విజ్ఞప్తి చేశారు. కాగా ఏడాదికి ఒకసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుందని, ఆ క్రమంలోనే ధరల సవరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్తి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలని చెప్పిన రేవంత్ రెడ్డి.. స్టాంప్ డ్యూటీ తగ్గించమా లేక పెంచడమా అన్న విషయంలో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.

Next Story