వాలంటీర్లతో జగన్ మన కొంపముంచేశారు: వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-21 10:49:58  IST  )

వాలంటీర్ల వ్యవస్థ వద్దని కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వ్యాఖ్యానించారు. ...

వాలంటీర్లతో జగన్ మన కొంపముంచేశారు: వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: వాలంటీర్ల(Volunteers) వ్యవస్థ వద్దని కర్నూలు జిల్లా(Kurnool District) మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి(Mantralayam MLA Balanagi Reddy) వ్యాఖ్యానించారు. ఈసారి వైసీపీ(Ycp) అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసుకోమని ఆయన స్పష్టం చేశారు. జగన్ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి తమ కొంప ముంచారని ఆయన ఆరోపించారు. వాలంటీర్ల వల్లే తాము ప్రజలకు దగ్గరకాలేకపోయామన్నారు. ప్రజలకు సరైన న్యాయం చేయలేకపోయామని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెడితే తప్ప పార్టీ నేతలు, కార్యకర్తలకు న్యాయం జరగదన్నారు. నేతలు, కార్యకర్తలు ఉంటే పార్టీ ఉంటుందని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చేదని బాలనాగిరెడ్డి పేర్కొన్నారు.

Next Story