- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్పీ ప్రశాంత్ పాటిల్‌కు చేరిన DNA రిపోర్టు.. మృతదేహాల అప్పగింత ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు బస్సు ప్రమాదం తీరని శోకాన్ని మిగిల్చింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు బస్సు ప్రమాదం తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయి. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి మొత్తం 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ముందుగా మృతుల కుటుంబ సభ్యుల డీఎన్ఏతో పాటు దుర్ఘటనలో పూర్తిగా కాలి ముద్దయిన డెడ్‌బాడీలకు ఫోరెన్సిక్ టీమ్ స్పాట్‌లోనే డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించింది. అనంతరం వాటిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇవాళ ఫోరెన్సిక్ టీమ్ మొత్తం 18 మృతదేహాలకు సంబంధించి డీఎన్‌ఏ రిపోర్టును ఎస్పీ ప్రశాంత్ పాటిల్‌కు అందజేసింది. మరికొద్దిసేపట్లో ఆ డీఎన్‌ఏ రిపోర్టులను మృతుల కుటుంబ సభ్యలతో సరిపోల్చి డెడ్‌బాడీలను అప్పగించనున్నారు. ప్రభుత్వం వారిని స్వస్థలాలకు పంపేందుకు ప్రత్యేక అంబులెన్స్‌లను కూడా సిద్ధం చేసింది. మరోవైపు బైకర్ శివశంకర్ మద్యం సేవించి వాహనం నడినట్లుగా ఫోరెన్సిక్ బృందం రిపోర్టు ఇవ్వడం సంచలనంగా మారింది.






