Breaking: కేఆర్ఎంబీ సమావేశం.. ఏపీ, తెలంగాణ కీలక వాదనలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-26 12:26:31  IST  )

ఏపీ, తెలంగాణ నీటి పంచాయితీని పరిష్కరించేందుకు కేఆర్ఎంబీ తాజాగా మరోసారి భేటీ అయింది...

Breaking: కేఆర్ఎంబీ సమావేశం.. ఏపీ, తెలంగాణ కీలక వాదనలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap), తెలంగాణ(Telangana) మధ్య నీటి పంచాయితీని పరిష్కరించేందుకు కేఆర్ఎంబీ(Krmb) తాజాగా మరోసారి భేటీ అయింది. హైదరాబాద్‌(Hyderabad)లో జరుగుతున్న ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో సమావేశం కొనసాగుతోంది. నీటి వాటాలపై చర్చిస్తున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ సాగర్ నుంచి 63 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరుతోంది. అటు ఏపీ కూడా 55 టీఎంసీలు అవసరముందని ఏపీ అంటోంది.

ఈ భేటీల కంటే ముందు తెలంగాణ, ఏపీ ఈఎన్సీల సమాశం జరిగింది. నల్గొండ, ఒంగోలుకు సంబంధించిన సీఈల సమావేశం జరిగింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలశయాల్లో ఉన్న నీటి లభ్యత, మే నెలాఖరు వరకూ రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించారు. ఆ సమావేశంలో తెలంగాణకు 63 టీఎంసీలు, ఏపీకి 53 టీఎంసీలు కావాలని సీఈల మీటింగ్‌లో చర్చించారు. ఈ చర్చల సారాంశాన్ని ఈ రోజు జరుగుతున్న కేఆర్ఎంబీ సమావేశంలో నివేదించనున్నారు. ఈ నెల 21నే కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. ఏపీ అధికారులు హాజరుకాలేమని చెప్పడంతో అదే రోజు కేఆరెంబీ ఎదుట తెలంగాణ అధికారులు హాజరై అభ్యంతరాలు, అవసరాలను వినిపించారు. డిమాండ్ల రూపంలో పత్రాన్ని అందజేశారు. ఏపీ ఎక్కువ నీటిని తరలిస్తోందని, వెంటనే నివారించాలని, టెలీ మెట్రీ మీటర్లను ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఆ ఖర్చులను కూడా తామే భరిస్తామని తెలిపారు.

అయితే 24న జరిగిన సమావేశంలో ఏపీ,తెలంగాణ అధికారులు హాజరయ్యారు. నీటి వాటాలపై చర్చించారు. రెండు రాష్ట్రాల అభ్యంతరాలు, అవసరాలను వినిపించారు. అయితే చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. అసలు శ్రీశైలం, నాగార్జున సాగర్ లో ఎంత నీటి లభ్యత ఉందనేదానిపై రెండు రాష్ట్రాల సీఈలతో కేఆర్ఎంబీ ఓ కమిటీని వేసింది. ఇప్పుడు అదే కమిటీతో ప్రస్తుతం కేఆర్ఎంబీ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఈ కమిటీ నివేదికను సమర్పించారు. అయితే తెలంగాణ మరో వాదనను వినిపిస్తోంది. ఏడాది రెండు జలశయాల్లో 1000 టీఎంసీల నీరు ఉంటే అందులో తాత్కాలిక సర్దుబాటు ప్రకారం ఏపీకి 666 టీఎంసీలు కాగా ఇందులో 630 టీఎంసీలు ఏపీ వినియోగించుకుందని, 27 టీఎంసీల నీరు మాత్రమే ఏపీకి అందించాల్సి ఉందని తెలంగాణ వాదిస్తోంది. అదే విధంగా తెలంగాణకు 112 టీఎంసీల నీరు తాగు, సాగుకు అవసరం ఉందని వాదనలు వినిపిస్తోంది. ఈ అంశాలపైనా కేఆర్ఎంబీ మీటింగ్‌లో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Next Story