వడ్డీతో సహా చెల్లిస్తాం: టీడీపీ నేతలకు సజ్జల వార్నింగ్

by Vemula.Srinu Prasad |

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని కూటమి నేతలకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు....

వడ్డీతో సహా చెల్లిస్తాం: టీడీపీ నేతలకు సజ్జల వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని కూటమి నేతలకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Ycp Leader Sajjala Ramakrishna Reddy) హెచ్చరించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్(Jogi Ramesh) ఇంటిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. విజయవాడ ఇబ్రహంపట్నం(Vijayawada Ibrahim Patnam)లో జోగి రమేశ్ ఇంటిని సజ్జల పరిశీలంచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆగ్రహం కలిగిస్తున్నాయన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవస్థలు పని చేయాలని, కానీ పరిస్థితులు అలా కనిపించడంలేదని మండిపడ్డారు. జోగి రమేశ్ ఇంటిపై దాడి జరుగుతుంటుంటే పోలీసులు టీడీపీ నేతలకు రక్షణగా నిలబడ్డారని ఆరోపించారు.

అంబటి ఇంటిపైనే అనుకుంటే..

అంబటి ఇంటిపై దాడి ఘటనను మరువకముందే ప్లానింగ్ ప్రకారం జోగి రమేశ్ నివాసానికి నిప్పు పెట్టారని సజ్జల గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన సాక్షాలు వీడియోల రూపంలో ఉన్నాయన్నారు. నిరసనకు వచ్చిన వాళ్లు కర్రలు, పెట్రోల్ బాంబులు తీసుకొస్తారని అని ప్రశ్నించారు. లోకేశ్ కు బుర్ర పాడైపోయిందంటేనే తమ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో చంద్రబాబు గారు అన్నా కేసులు పెడతారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. చట్టం, పోలీసులను తమ చేతిల్లోకి తీసుకుని టీడీపీ నేతలు ఇలా ప్రవర్తిస్తున్నారని సజ్జల ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ అబద్ధమని సీబీఐ, సిట్ తేల్చిందని, వాస్తవాలు తెలియకుండా ఉండాలనే ఇలా దాడులకు పాల్పడ్డారని సజ్జల వ్యాఖ్యానించారు. ఈ దాడులను తాము ఎదుర్కొంటామని, ఇంతకు మించి ఏమీ చేయగలరు అని సజ్జల మండిపడ్డారు.

Next Story