- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లిపై దాడి చేసిన తమ్ముడు.. కోపంతో చాకుతో పొడిచిన అన్న
కంటికి రెప్పలా కాపాడాల్సిన కుమారుడు కన్న తల్లిపై చేయిచేసుకున్నాడు. తమ్ముడు చేయి చేసుకోవడాన్ని గమనించిన అన్న అమ్మమీదే చేయి చేసుకుంటావా అంటూ ఆగ్రహానికి గురయ్యాడు..

దిశ, డైనమిక్ బ్యూరో: కంటికి రెప్పలా కాపాడాల్సిన కుమారుడు కన్న తల్లిపై చేయిచేసుకున్నాడు. తమ్ముడు చేయి చేసుకోవడాన్ని గమనించిన అన్న అమ్మమీదే చేయి చేసుకుంటావా అంటూ ఆగ్రహానికి గురయ్యాడు. క్షణికావేశంలో చాకు తీసుకుని తమ్ముడి చాతిలో పొడిచాడు. దీంతో తమ్ముడు చనిపోయాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
కాగా మైలవరం నియోజకవర్గం స్థానిక పొందుగల రోడ్డులో కృష్ణవరపు ప్రసన్నకుమార్, కరుణ కుమార్‌లు నివశిస్తున్నారు. అయితే తల్లిపై కరుణ కుమార్ దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన అన్న ప్రసన్నకుమార్ తమ్ముడిపై కోపంతో రగిలిపోయాడు. పక్కనే ఉన్న చాకుతో తమ్ముడిని పొడవడంతో కరుణ కుమార్ అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిగా కరుణకుమార్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.






