- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పక్కదారి పట్టిన మహిళా సంఘం డబ్బులు
గత నెలలో మహిళా సంఘం డబ్బులు పక్కదారి పట్టాయి. ఇప్పటివరకు ఇంకా రికవరీ కాలేదు. దీంతో మహిళా సంఘం సభ్యులు లబోదిబోమంటున్నారు. అధికారులు రికవరీ చేస్తామని చెప్తున్నా ఇంత వరకు ఏమీ లేదని సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల రికవరీ విషయంలో అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో? అని మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దిశ, నందిగామ: గత నెలలో మహిళా సంఘం డబ్బులు పక్కదారి పట్టాయి. ఇప్పటివరకు ఇంకా రికవరీ కాలేదు. దీంతో మహిళా సంఘం సభ్యులు లబోదిబోమంటున్నారు. అధికారులు రికవరీ చేస్తామని చెప్తున్నా ఇంత వరకు ఏమీ లేదని సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల రికవరీ విషయంలో అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో? అని మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
వీఏవో భర్త నిర్వాకం..
మహిళా సంఘం సభ్యుల డబ్బులు పక్కదారి పట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్త్రీ నిధి నిధులను ఓ వీఏవో (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్) భర్త పక్కదారి పట్టించాడు. మండల పరిధిలోని వీర్లపల్లి గ్రామంలో 2023 నుంచి 2024వ సంవత్సరానికి సంబంధించిన డబ్బులు పక్కదారి పట్టాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీర్లపల్లి గ్రామంలో 29 మహిళా సంఘాలున్నాయి. అందులో భాగంగానే గ్రామంలో వీవో ఏగా విధులు నిర్వహిస్తున్న భవాని, ఆమె భర్త రమేశ్ అన్నీ తనే చూసుకుంటున్నాడు. వీర్లపల్లి గ్రామంలో రోజా, జ్యోతి, శ్రీలక్ష్మి, శ్రీ నిత్య, రూప సంఘాలకు సంబంధించిన బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తానని చెప్పి తీర్మానాలు చేసి బ్యాంకు ద్వారా సంఘం సభ్యులకు ఖాతాలోకి జమ కావాల్సిన రూ.8.40 లక్షల రుణాలను తన ఖాతాలోకి వేసుకున్నాడు. చేసిన ఘనకార్యం మహిళా సంఘం సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. సభ్యులు డబ్బులు అడిగినప్పుడల్లా ఇస్తానని చెప్పుకొచ్చాడు. ప్రతి నెలా సుమారు రూ.1.55 లక్షల నగదును వారి నుంచి వసూలు చేసి శ్రీనిధి బ్యాంకులో చెల్లించకుండా మొత్తం రూ.27 లక్షలు సొంతంగా వాడుకున్నారు.
ఆలస్యంగా వెలుగులోకి..
మహిళా సమాఖ్య అధికారులు ఇటీవల గ్రామ పెద్దల సమక్షంలో డబ్బులు సొంతంగా వాడుకున్న రమేశ్‌ను పిలిపించి డబ్బుల గురించి నిలదీశారు. దీంతో రమేశ్ మహిళా సంఘం డబ్బులు, శ్రీనిధి డబ్బులు మొత్తం రూ.35 లక్షలు వాడుకుంది నిజమే అని ఒప్పుకున్నాడు. మొత్తం డబ్బులు వీలైనంత త్వరగా చెల్లిస్తానని తెల్ల కాగితం రాసి రెవెన్యూ స్టాంపులు అతికించి సంతకం చేశాడు. వీవోఏగా విధులు నిర్వహిస్తున్న భవాని ఉండగా.. ఆమె భర్త రమేశ్ ఎందుకు జోక్యం చేసుకున్నాడనే విషయాలు అర్థం కావడం లేదని, అధికారులు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి.
రికవరీ చేస్తాం..
నందిగామ మండల పరిధిలోని వీర్లపల్లి మహిళా సంఘం సభ్యుల డబ్బులు వివోఏ భర్త సొంతనకి వాడుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. అతడి నుంచి మొత్తం డబ్బులు త్వరలోనే రికవరీ చేపిస్తాం.
- అనిల్, స్త్రీనిధి ఆర్‌ఎం






