- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: కూటమి నేతలు కొత్త నాటకానికి తెర తీశారని కూటమి నేతలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్(Former Minister Vellampalli Srinivas) సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారం(Tirumala laddu issue)పై సిట్ నివేదిక ఇచ్చినా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జంతువుల కొవ్వు అంటే భక్తులు నమ్మడంలేదని, బాత్ రూమ్‌లు కడిగే యాసిడ్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తినే పదార్థాల్లో యాసిడ్ వేసుకుని తింటే ఏం జరుగుతుందో కూటమి నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. కొంతమంది జోకర్లే హిందూ ధర్మాన్ని అప్రతిష్టపాలు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే నెయ్యి లారీలు వచ్చాయని, రిటర్న్ అయ్యాయని తెలిపారు. కానీ అవే మళ్లీ తిరిగి ట్యాంకర్లుగా తిరుమల లడ్డూ తయారీ కేంద్రంలోకి వెళ్లాయని తెలిపారు. వైఎస్ జగన్(Ys Jagan) హయాంలో తిరుమల పవిత్రతపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అపచారాలు జరిగాయని వెల్లంపల్లి వ్యాఖ్యలు చేశారు. అయోధ్య లక్ష లడ్డూలు పంపారని పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఊగిపోయారని, అవి ఎవరు తయారు చేయించారో ముందుకు తెలుసుకోవాలన్నారు. పూటకో రకంగా మాట్లాడే పవన్‌ను, నాగబాబు ప్రజలెవరూ పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి వెల్లంపల్లి ఎద్దేవా చేశారు.






