Pedana: 'వాల్తేరు వీరయ్య' విలన్ బాబీ సింహా సందడి (వీడియో)

by Disha Web Desk 16 |
Pedana: వాల్తేరు వీరయ్య విలన్ బాబీ సింహా సందడి (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: 'వాల్తేరు వీరయ్య' సినిమా విలన్‌ బాబీ సింహా కృష్ణా జిల్లా పెడనలో సందడి చేశారు. స్థానికంగా ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయాన్ని కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి బాబీ సింహా ప్రత్యేక పూజలు నిర్వహించారు.సందర్భంగా ఆలయ చైర్మన్, గ్రామస్థులు బాబీ సింహాను ఘనంగా సన్మానించారు. అనంతరం బాబీ సింహా మీడియాతో మాట్లాడారు. 'వాల్తేరు వీరయ్య' సినిమాలో తాను చేసిన విలన్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. తారకటూరు తన కన్నతల్లి స్వగ్రామమని, ఇక్కడ ఉన్న శ్రీ చెన్న కేశవ స్వామి తమ ఆరాధ్య దైవమని వెల్లడించారు. 'వాల్తేరు వీరయ్య' సినిమాలో తన పాత్రకు వచ్చిన స్పందన స్వామి వారి అనుగ్రహమేనన్నారు. అందువల్లే స్వామివారి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చినట్లు బాబీ సింహా వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానికులు బాబీ సింహను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.



Next Story

Most Viewed