ప్రాణం తీసిన డ్రైన్.. తీవ్ర విషాదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-05 03:02:04  IST  )

విజయవాడ గుణదలలో విషాదం చోటు చేసుకుంది. ..

ప్రాణం తీసిన డ్రైన్.. తీవ్ర విషాదం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ గుణదల(Vijayawada Gunadala)లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక వైయస్సార్ కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సైడ్ డ్రైన్‌లో పడ్డారు. దీంతో స్థానికులు గమనించి ఇద్దరు పిల్లలను రక్షించారు. మరో బాలుడు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు ఏడేళ్ల బాలుడు మణికంఠగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు క్రాంతి కుమార్ పరామర్శించారు. రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించారు.

Next Story