- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: కృష్ణా జిల్లా గూడూరులో హైటెన్షన్.. భారీగా చేరుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు
by Vemula.Srinu Prasad |
కృష్ణా జిల్లా గూడూరు వైజంక్షన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు....

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా గూడూరు వైజంక్షన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబును స్వాగతించేందుకు గజమాల ఏర్పాటు చేశారు. అయితే అటు వైసీపీ కార్యక్తలు కూడా గూడూరు వైజంక్షన్ వద్దకు భారీగా చేరుకున్నారు. మంత్రి జోగి రమేశ్‌ను స్వాగతం పలికేందుకు భారీ గజమాల ఏర్పాటు చేశారు. పోటాపోటీ నినాదాలు ఆ ప్రాంతం దద్దరిల్లిపోతోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు. రెండువర్గాల మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తున్నారు. పరస్పరం ఎదురు పడకుండా ఉండేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎవరి కార్యక్రమం వారు నిర్వహించుకోవాలని టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు సూచించారు.
Next Story






