- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
Skill Case: చంద్రబాబు బెయిల్, కస్టడీపై ఒకేసారి తీర్పు.. ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం

దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన తరపు లాయర్లు కోరారు. అయితే సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. చంద్రబాబును మరింత ప్రశ్నించేందుకు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన మెమోను దాఖలు చేశారు. అయితే చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది. ఇరువర్గాల వాదనలు రేపు వింటామని, తీర్పు కూడా ఒకేసారి ఇస్తామని న్యాయమూర్తి సూచించింది. దీంతో ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందనే ఉత్కంఠ తెలుగు తమ్ముళ్లలో నెలకొంది.
కాగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే మరో 11 రోజులపాటు రిమాండ్ పొడిగించడంతో ఆయన జైలులోనే ప్రత్యేక ఖైదీగా ఉండనున్నారు. ప్రస్తుతం చంద్రబాబుతో నారా భువనేశ్వరి, బ్రాహ్మిణి ములాఖత్ అయ్యారు. వారంలో రెండు సార్లు ములాఖత్‌కు అనుమతి ఉంది. మూడోసారి ములాఖత్ కావాలంటే జైలు అధికారుల నిర్ణయం తప్పనిసరి.