- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gannavaram: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్
గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది...

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం టీడీపీ ఆఫీస్(Gannavaram Tdp Office)పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో తనను పోలీసుల ఒత్తిడి చేశారని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్ట్(SC and ST Special Court)కు ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ తెలిపారు. అంతేకాదు పోలీసుల నుంచి రక్షించాలని జడ్జిని వేడుకున్నారు. అలాగే కేసువిరమించుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ స్టేట్ మెంట్‌ను జడ్జి రికార్డు చేశారు.
కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. అప్పటి సీఎం, వైసీపీ అధినేత జగన్(Ycp Chief Jagan)పై గన్నవరం టీడీపీ నేతలు విమర్శలు చేశారని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయం ప్రాంగణంలో ఉన్న కార్లకు నిప్పుపెట్టారు. అక్కడ ఉన్న సిబ్బందిపై దాడి చేశారు. దీంతో అక్కడ పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారని ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేశారు. పలువురిని ఇప్పటికే అరెస్ట్ చయేసి జైలుకు తరలించారు. అయితే సత్యకుమార్ ను కులం పేరుతో దూషించిన కేసులో ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కేసును విరమించుకుంటున్నట్లు సత్యకుమార్ న్యాయస్థానం ఎదుట చెప్పారు. దీంతో సత్యకుమార్ తో పాటు అతని కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులకు జడ్జి ఆదేశించారు.






