ఏపీకి పిడుగుల గండం: మూడు గంటల్లో భారీ వర్షం..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-21 10:40:01  IST  )

రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిరోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ అకాల వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి..

ఏపీకి పిడుగుల గండం: మూడు గంటల్లో భారీ వర్షం..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ద్రోణి(Droni) ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణం(Weather) మారిపోయింది. కొద్దిరోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ అకాల వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. అయితే పిడుగుల(Thunder) హెచ్చరికలు మాత్రం ఆందోళనలు కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో పలుచోట్లఆకాశం మేఘావృతమైంది. అంతేకాదు ఈదురు గాలులు సైతం వీస్తున్నాయి.

కృష్ణా జిల్లాకు అలర్ట్

మరోవైపు కృష్ణా జిల్లాకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. ద్రోణి ప్రభావంతో రానున్న 3 గంటల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రధానంగా తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ప్రజలకు ముఖ్య హెచ్చరిక

అయితే పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, గొర్రెల కాపరులు పొలాల్లో ఉండొద్దని అధికారులు హెచ్చరించారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల చెంత ఉండకూడదని తెలిపారు. సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని విజ్ఞప్తి చేశారు.

Next Story