Ap Liquor Case: వాసుదేవరెడ్డికి రిమాండ్

by Vemula.Srinu Prasad |

ఏపీ మద్యం కేసులో రాష్ట్రా బేవరెజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ, ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.

Ap Liquor Case: వాసుదేవరెడ్డికి రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ బెవరెజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ, ఐఆర్టీఎస్ అధికారి(Former MD of AP Beverages Corporation and IRTS officer) వాసుదేవరెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. జగన్ హయాంలో జరిగిన ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించి విజయవాడ ఏపీఎస్బీసీఎల్ కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు, ఇతర కీలక పత్రాలను చోరీ చేశారన్న ఫిర్యాదుపై ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర అభియోగాలతో 2024 జూన్ నెలలో ఏ2 నిందితుడిగా ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో వాసుదేవరెడ్డిని సీఐడీ పోలీసులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. వెంటనే వాసుదేవరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ధర్మాసనం రిమాండ్ విధించడంతో వాసుదేవరెడ్డిని గుంటూరు జైలుకు తరలించారు

Next Story