వైఎస్సార్ కాలనీ బ్లేడ్ బ్యాచ్‌లే దాడి చేశారు: జోగి రమేశ్ ఇంటి సిబ్బంది

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-01 12:58:31  IST  )

వైఎస్సార్ కాలనీ బ్లేడ్ బ్యాచ్‌లే దాడి చేశారని జోగి రమేశ్ ఇంటి సిబ్బంది తెలిపారు..

వైఎస్సార్ కాలనీ బ్లేడ్ బ్యాచ్‌లే దాడి చేశారు: జోగి రమేశ్ ఇంటి సిబ్బంది
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఇబ్రహీంపట్నం(Vijayawada Ibrahimpatnam)లో మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) నివాసంపై కొందరు దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. అంతేకాదు రాళ్ల దాడి చేశారు. ఇంటి అద్దాలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అయితే ఈ దాడి చేసిందే ఎవరో జోగి రమేశ్ ‌ఇంటి సిబ్బంది, ప్రత్యక్ష సాక్షి స్పష్టం చేశారు.

ఉదయం 10.30కే సమాచారం ఉంది...

‘‘మాకు ఈ రోజు ఉదయం 10.30, 11గంటల మధ్య సమాచారం అందింది. జోగి రమేశ్ ఇంటిపై దాడి చేస్తారు.. జాగ్రత్తగా ఉండాలనే సమాచారం తెలిసింది. వెంటనే జోగి రమేశ్‌కు సమాచారం అందించాం. ఆయన వెంటనే ఏసీపీ, డీసీపీ, సీఐకి ఇంటిమేట్ చేశారు. జోగి రమేశ్ ఇంటివద్ద 2.30 గంటలకు చాలా మంది గుమ్మిగూడారు. అప్పటి వరకూ కూడా పోలీసులు పట్టించుకోలేదు. గొల్లపూడి, కృష్ణలంక, వైఎస్సార్ కాలనీ బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లను జోగి ఇంటి వద్దకు తరలించారు. వాహనాల్లో పెట్రోల్ బాంబులు,కర్రలు, రాడ్లు తీసుకొచ్చారు. మేం జ్యోగి రమేశ్ ఇంట్లోనే ఉన్నాం. హేయాతిహేయంగా ప్రవర్తించారు. పెట్రోల్ బాంబులు విసురుతుంటే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. దారుణాతి దారుణంగా ఇంటి ఫర్నిచర్ తగలబడ్డాయి. ఇంట్లో ఉన్న జోగి కుటుంబం ఆందోళనకు గురైంది.’’ అని ఆయన తెలిపారు.

ఒళ్లు తగ్గించుకుని, బుర్ర పెంచమంటే దాడులు చేస్తారా: జోగి రమేశ్

Next Story