పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది

by Thanuru Gopichand |

పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిదని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కమిషనర్ ఎస్.వ.రాజశేఖర్ బాబు అన్నారు.

పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది
X

దిశ, వెబ్ డెస్క్ : పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిదని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కమిషనర్ ఎస్.వ.రాజశేఖర్ బాబు అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని (Police Commemoration Day) పురస్కరించుకొని కమిషనరేట్ లో కాండిల్ ర్యాలీని నిర్వహించారు. వారం రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ ఉత్సవాల్లో పోలీసులను త్యాగాలను స్మరించుకున్నారు. చివరి రోజైన శుక్రవారం కాండిల్ ర్యాలీని నిర్వహించగా ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలవారు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు (Rajashekar Babu) మాట్లాడుతూ ఈ కొవ్వుతుల కాంతులు కేవలం వెలుగులు కావు అన్నారు. ఈ వెలుగులు పోలీసు అమరవీరుల త్యాగాలను తెలియజేసే గాథలకు ప్రతీకలన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలు దేశభక్తి, సేవ, పోలీసు కుటుంబ సభ్యులుగా ఉండడం వల్ల కలిగే గౌరవానికి చిహ్నాలని తెలిపారు. దేశాన్ని రక్షించడంలో చేసిన పోలీసు అమవీరుల త్యాగం ఎన్నటికీ మరువలేనిదన్నారు. అమరవీరుల త్యాగాలకు వేవేల జోహార్లను తెలిపారు.

Next Story