- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ.. నిందితుడి అరెస్ట్
విజయవాడలో డాక్టర్ దీపిక ఆత్మహత్యకు గత కారణాలు తెలిసిపోయాయి. డాక్టర్ అమర్ మోసం చేయడమే ఇందుకు కారణమని పోలీసులు గుర్తించారు..

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(vijayawada)లో డాక్టర్ దీపిక(Dr. Deepika) ఆత్మహత్య(Suicide) చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దీపిక ఆత్మహత్యకు కారణాలు తెలిసిపోయాయి. డాక్టర్ అమర్ మోసం చేయడమే ఇందుకు కారణమని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసు మిస్టరీ వీడింది. ప్రమాదకర ఇంజెక్షన్ చేసుకుని దీపిక సూసైడ్ చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు ముందు ఆమెతో అమర్ మాట్లాడినట్లు నిర్ధారణ అయింది. దీంతో నిందితుడు అమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలు జరిగిందిదే....
కాగా అనంతపురం మెడికల్ కాలేజీలో చదువుతూ విజయవాడ జీజీహెచ్‌లో వైద్యురాలిగా దీపిక విధులు నిర్వహిస్తున్నారు. గత నెల 27న ఆమె అనుమానాస్పదంగా మృతి చెందారు. విధుల్లో ఉన్న సమయంలోనే ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇంజెక్షన్ తీసుకున్నారు. అయితే ఆ తర్వాత దీపిక మృతి చెందారు. విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ మేరకు అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.






