ఎయిర్ పోర్టులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో ఎయిర్ పోర్టులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింటి..

ఎయిర్ పోర్టులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్
X

దిశ, వెబ్ డెస్క్: ఎయిర్ పోర్టులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. విజయవాడ, తిరుపతి, విశాఖతో పాటు పలు విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పలు ఎయిర్ పోర్టుల్లో త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎయిర్ పోర్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. టెర్నినల్ భవనం డిజైన్లు విభిన్నంగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించింది. అంతేకాదు గడువులోగా టెర్నినల్ భవనాన్ని పూర్త చేయాలని సూచించారు. విశాఖలో సివిల్ ఏవియేషన్ వర్సిటీ ఏర్పాటును పరిశీలన చేయాలని విమానయాన శాఖకు చంద్రబాబు సూచించారు. దీంతో వర్సిటీపై త్వరలో కీలక ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు.

Next Story