విజయవాడలో ఐఏఎస్ భార్య మృతి.. విచారణకు బంధువుల డిమాండ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-04 13:47:13  IST  )

ఐఏఎస్ అధికారి కిషోర్ భార్య సత్యదీపిక మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ...

విజయవాడలో ఐఏఎస్ భార్య మృతి.. విచారణకు బంధువుల డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: ఐఏఎస్ అధికారి కిషోర్(IAS officer Kishore) భార్య సత్యదీపిక మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదురోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె ఆదివారం మృతి చెందారు. గొంతు నొప్పితో సత్యదీపిక బాధపడుతుండటంతో ఐఏఎస్ కిషోర్ ఐదు రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందిన ఆమె సడెన్‌గా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సత్యదీపిక మృతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ(Vijayawada) పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story