- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిట్ దూకుడు.. కేఎన్‌ఆర్‌కు ప్రశ్నల వర్షం
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెప్తున్న మద్యం కుంభకోణం కేసు విచారణ తీవ్ర రూపం దాల్చింది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మద్యం కుంభకోణం కేసు విచారణ తీవ్ర రూపం దాల్చింది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీఏ కె. నాగేశ్వరరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీల రూపకల్పన, లైసెన్సుల జారీ, అలాగే నిధుల మళ్లింపునకు సంబంధించిన కీలక అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తొలి రోజు కీలక సమాచారం
విజయవాడలోని సిట్ కార్యాలయంలో బుధవారం జరిగిన తొలి రోజు విచారణ సుదీర్ఘంగా సాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు తొమ్మిదిన్నర గంటల పాటు కేఎన్‌ఆర్‌ను అధికారులు ప్రశ్నించారు. మద్యం వ్యాపారులతో ఉన్న సంబంధాలు, తెరవెనుక నడిచిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు సంధించిన ప్రశ్నలకు ఆయన నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. తొలిరోజు విచారణలో లభించిన సమాచారం ఆధారంగా రెండో రోజు సైతం విచారణ చేపట్టారు.
మరిన్ని అరెస్టులు ఉండేనా?
మొదటి రోజు విచారణ ముగిసిన వెంటనే గురువారం రెండో రోజు కూడా కేఎన్‌ఆర్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. లభించిన కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను ముందుంచి అధికారులు ఆయన్ను మరింత లోతుగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ మద్యం కుంభకోణంలో మరికొందరు కీలక నేతలు, అధికారుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో సిట్ తదుపరి చర్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.






