Gannavaram : వైసీపీకి యార్లగడ్డ రాజీనామా.... సజ్జల రియాక్షన్ ఇదే..!

by Disha Web Desk 16 |
Gannavaram : వైసీపీకి యార్లగడ్డ రాజీనామా.... సజ్జల రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: గన్నవరంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు రాజీనామా చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరడంతో యార్లగడ్డ వెంకట్రావు చాలా సార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం రాష్ట్రంలో మరికొన్నినెలల్లో ఎన్నికలు జరనున్నాయి. వైసీపీ నుంచి వల్లభనేని వంశీకే సీఎం జగన్ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్ బై చెప్పారు. అంతేకాదు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబును కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.

దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. యార్లగడ్డ రాజీనామా నిర్ణయం ముందే తీసుకున్నారనిపిస్తోందని సజ్జల వ్యాఖ్యానించారు. ఎవరికైనా వ్యక్తి గత స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఏ పార్టీలోనైనా అసంతృప్తులు ఉంటారని.. పార్టీ మార్పులు సహజమేనని కొట్టిపారేశారు. కష్టపడి పని చేస్తే పార్టీ కచ్చితంగా గుర్తిస్తుందని చెప్పారు. చంద్రబాబు, పవన్ టార్గెట్ సీఎం జగన్ అని వ్యాఖ్యానించారు. జగన్ ఓటమే తమ లక్ష్యమని పవన్ కల్యాణ్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారని సజ్జల గుర్తు చేశారు. జగన్‌ను ఓడించేందుకు పవన్ కల్యాణ్ ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటారని సజ్జల విమర్శించారు.

Read More : గన్నవరంలో వైసీపీకి బిగ్ షాక్ : టీడీపీలోకి యార్లగడ్డ వెంకట్రావు

Next Story

Most Viewed