రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్... వీడియో వైరల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-13 14:07:30  IST  )

విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఆరో నెంబర్ ప్లాట్‌పై కదులుతున్న చర్లపల్లి–షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారీ పడిన ప్రయాణికుడిని రైల్వే కానిస్టేషన్ రక్షించారు..

రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్... వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఈ రోజు షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆరో నెంబర్ ప్లాట్‌పై చర్లపల్లి–షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్(18046) రైలు వచ్చింది. ప్రయాణికులు ఎక్కిన వెంటనే రైలు కదిలింది. చిన్నగా స్పీడందుకుంది. అయితే ఓ ప్యాసింజర్ హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు. కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నం చేశారు. అయితే కారు జారీ ప్రమాదంలో చిక్కుకున్నారు. అయితే అక్కడే డ్యూటీలో ఉన్న ఆర్పీఎస్ హెచ్‌సీ నరసింహరావు గమనించి వెంటనే స్పందించారు. అత్యవసర బ్రేక్ ఉపయోగించి రైలును ఆపారు. ప్యాసింజర్‌ను రక్షించారు. దీంతో ప్రయాణీకుడు సురక్షితంగా తన కుటుంబంతో ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో దక్షిణ మధ్య రైల్వే పోస్ట్ చేసింది.

ప్రయాణికుడిని రక్షించిన కానిస్టేబుల్ వీడియో వైరల్

Next Story