Vijayawada : కదులుతున్న రైలులో కాన్పు.. ఆదుకున్న రైల్వే సిబ్బంది

by Ramesh Naini |

రైలులో (నెం. 13352) ప్రయాణిస్తున్న ఓ గర్భిణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Vijayawada : కదులుతున్న రైలులో కాన్పు.. ఆదుకున్న రైల్వే సిబ్బంది
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైలులో (నెం. 13352) ప్రయాణిస్తున్న ఓ గర్భిణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం విజయవాడ డివిజన్ పరిధిలో ఆమెకు పురిటినొప్పులు రావడంతో.. రైల్వే టికెట్ చెకింగ్ సిబ్బంది తక్షణమే స్పందించి, సురక్షితంగా ప్రసవం జరిగేలా సహాయపడ్డారు. అనంతరం తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తిని, మానవత్వాన్ని ప్రశంసిస్తూ దక్షిణ మధ్య రైల్వే (SCR) సోమవారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఈ వివరాలను వెల్లడించింది. ఘటనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

Next Story