ఐదేళ్లు ఆశగా ఎదురు చూశారు.. గట్టిగా డిమాండ్ చేయడంతో అరెస్ట్

by Disha Web Desk 16 |
ఐదేళ్లు ఆశగా ఎదురు చూశారు..  గట్టిగా డిమాండ్ చేయడంతో అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోలీస్‌ శాఖ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి డిమాండ్ చేసింది. ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో డీవైఎఫ్ఐ నేతలు విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. అయితే ఈ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, డీవైఎఫ్ఐ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీవైఎఫ్‌ఐ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని న్యాయమైన డిమాండ్ కోసం ధర్నా చేస్తుండగా అక్రమంగా నిర్బంధించడం అన్యాయయమని డీవైఎఫ్ఐ నేతలు అన్నారు. ఐదేళ్లుగా ఆశతో ఎదురు చూసిన అభ్యర్థుల ఆశలపై ఈ ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. తెలంగాణలో ఐదేళ్ల వయోపరిమితి పెంచితే రాష్ట్రంలో మాత్రం పెంచకుండా తమ భవిష్యత్‌ను చీకట్లో నెట్టేసిందని ఆరోపించారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా వైసీపీ ప్రభుత్వం కూడా పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో వయోపరిమితిని ఐదేళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి : ఏపీలో భారీ వర్షాలు.. బాధితులకు రూ. 2 వేలు, రేషన్


Next Story

Most Viewed