మద్యం కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్.. రిమాండ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-02 16:41:12  IST  )

మద్యం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.,.

మద్యం కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్.. రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మద్యం కేసు(Liquor case)లో ఇద్దరు నిందితులను సిట్ అధికారులు(SIT Officials) అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada Acb Court)లో హాజరుపర్చారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఇద్దరు నిందితులు బాలాజీ, నవీన్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశించింది. ఈ మేరకు ఇద్దరు నిందితులను జైలుకు తరలించారు. ఇక ఇదే కేసులో మరో నిందితులకు బిగ్ షాక్ తగిలింది. ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది.

Next Story