ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు : విజయవాడ పోలీస్

by Thanuru Gopichand |   (  Updated:2025-10-29 09:37:26  IST  )

మొంథా తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజయవాడ పోలీసులు కోరారు.

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు : విజయవాడ పోలీస్
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజయవాడ పోలీసులు కోరారు. ప్రజల భద్రతే తమ కర్తవ్యమని, అందులో భాగంగా ముందస్తు చర్యలను చేపడుతున్నామన్నారు. విజయవాడలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అక్కడి ప్రజలను హెచ్చరిస్తున్నామన్నారు. అవసరమైన చోట నివాసితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా పోలీసులకు సహకరించాలన్నారు. తుఫాను కారణంగా చెట్లు, ఎలక్ట్రిక్ పోల్స్, ఫ్లెక్సీలు పడిపోయే అవకాశం ఉందన్నారు. వాటి వద్ద నిలబడి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని సూచించారు. మరో పది గంటల వరకు తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు 680 మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు. విజయవాడ పోలీసులు ఇతర శాఖలతో కలిసి సమన్వయంతో పని చేస్తున్నారని తెలియజేశారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అందుకు ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

READ MORE .....

సహాయక చర్యల్లో ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు

Next Story