- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రుల జోక్యం.. దుర్గగుడి ప్రాబ్లం సాల్వ్
మంత్రుల జోక్యంతో దుర్గగుడి సమస్య పరిష్కారం అయింది..

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రి(Vijayawada Indrakiladri) సమస్యకు చెక్ పడింది. విద్యుత్ బిల్లుల(Electricity bills) బకాయితో దుర్గగుడికి కరెంట్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమస్యకు మంత్రుల జోక్యంతో పరిష్కారం లభించింది. అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. దుర్గగుడిపై విద్యుత్ సరఫరా నిలిపివేతతో పాటు, సోలార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు కనెక్ట్ చేసే అంశంపై ఈ సమీక్షలో చర్చించారు. ఇరు శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని నిశ్చయించుకున్నారు. భక్తుల మనోభావాలకు పెద్ద పీఠ వేయాలని నిర్ణయించారు.
విద్యుత్ బిల్లుల చెల్పింపునకు సుముఖత
పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులను చెల్లించేందుకు దేవాదాయ శాఖ అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. విడతల వారీగా చెల్లించేందుకు ఇరు శాఖల ఉన్నతాధికారుల మధ్య సయోధ్య కుదిరింది. దుర్గగుడికి చెందిన ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్‌కు రెండు 500 కిలోవాట్ల సామర్థ్యం గల రెండు నెట్ మీటర్ల ఏర్పాటుకు విద్యుత్ శాఖ అధికారులు అంగీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని ఇరు శాఖల అధికారులు మంత్రులకు విన్నవించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఈ సందర్భంగా మంత్రులు సూచించారు. దీంతో విజయవాడ దుర్గగుడికి సంబంధించి విద్యుత్ శాఖ, దేవాదాయ శాఖల మధ్య నెలకొన్న సమస్య కొలిక్కి వచ్చింది. భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా, ఆలయ పవిత్రత కాపాడేలా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి.






